సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు, మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ టిడిపి అభ్యర్థులకు బి-ఫారాలను టిడిపి జిల్లా ఎన్నికల పరిశీలకుడు రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్,,మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి , టీడీపీ సీనియర్ నేత మెంటే పార్ధ సారధి అందజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ వీరవాసరం భీమవరం మండలాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కూటమి అభ్యర్థుల విజయానికి కూటమి నాయకులు కార్యకర్తలు విశేష కృషి చేసి అత్యధిక మెజార్టీని తీసుకురావాలని కోరారు. జిల్లా ఎన్నికల పరిశీలకుడు రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ .. టీడీపీ , బీజేపీ, జనసేన క్యాడర్ సమైక్యంగా పని చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.
