సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడు ప్రధాన నిందితుడుగా చంద్రబాబు సర్కార్ భావించిన రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో మంచి ఊరట లభించింది. కసిరెడ్డి అరెస్ట్ విధానం, ప్రొడక్షన్ వారెంట్, బెయిల్ పై రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. కసిరెడ్డికి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో జోక్యానికి నిరాకరించింది. కసిరెడ్డి ని ‘అరెస్టు చేయబోము’ అని కోర్టులో హామీ ఇచ్చిన తర్వాత కూడా ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయడంపై సుప్రీంకోర్టులో తీవ్ర వాదనలు జరిగాయి.హైకోర్టు తీర్పులోని కొన్ని వ్యాఖ్యలను అంగీకరించకపోయినా, నిందితుడి బెయిల్, స్వేచ్ఛను రద్దు చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసులు నేరుగా చేసే అరెస్ట్‌కు, కోర్టు జారీ చేసే ప్రొడక్షన్ వారెంట్‌కు తేడా ఉందని ధర్మాసనం తెలిపింది.అయితే కసి రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది. ఇదే కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిల బెయిల్ మరియు ఈడీ కస్టడీ, ఎస్ఐటీ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు విచారణ జరపటం గమనార్హం
