సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో వివాదాలు మధ్య మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఇక ఈ నెల 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కారణంగా ఉద్యోగులకు ఈనెల 4, 5 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే నవంబర్ 4న పోలింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించారు.. పోలింగ్ ఏర్పాట్ల కోసం వచ్చే సిబ్బంది ఏర్పాట్లు కోసం బుధవారం.. పోలింగ్‌కు సంబంధించి గురువారం కూడా సెలవుగా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆయా స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటిస్తారు.
