సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ : విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతి కి వస్తున్నాము ,, ఆయన కీలక పాత్రలో మొదటి 2 రోజుల్లోనే ఈ చిత్రం ‘శివ శంకర్ వర ప్రసాద్’ సినిమాలు వరుసగా 300 కోట్లు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ లో అరుదయిన రికార్డు వెంకటేష్ వశం అయ్యింది. మరి ఆదర్శ కుటుంబం హ్యాట్రిక్ సినిమా అవుతుందా? అంటే.. అనేక వాయిదాల తరువాత, అంచనాలు తగ్గి, ఎన్నో ట్రోలింగ్ లకు గురిఅయి తాజగా విడుదల అయిన ఆదర్శ కుటుంబం AK 47 నేటి ఆదివారం తో 3 రోజులు పూర్తీ చేసుకొని అవలీలగా 50 కోట్లు కలెక్షన్స్ సాధించడంతో ఈసినిమా ఫై ‘బాడ్’ గా రిఫ్యూలు ఇచ్చిన వారు, ట్రోలింగ్ చేసినవారు అవాక్క పోయారు. సినిమాకు ‘మంచి’ టాక్ రేజ్ కావడంతో నిన్న నేడు, తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ సంఖ్యా కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ‘వెంకీ మామ’ మ్యాజిక్ మరోసారి పనిచేస్తుంది. ఆదర్శ కుటుంబం థియేటర్స్, కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోవడం విశేషం. సినిమా మార్కెట్ అంచనాల ప్రకారం 70 కోట్ల షేర్ , 135 కోట్ల కలెక్షన్ రాబడితే సినిమా సేఫ్.. ఐతే ప్రస్తుతం సినిమా ఊపు చూస్తుంటే అవలీలగా 2వరాల లోపే టార్గెట్ సాధించే అవకాశం ఉంది. మొదటి 2 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా ₹34.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. నేడు ఆదివారం అడ్వాన్ బుకింగ్ లో 90 శాతం హౌస్ ఫుల్ కావడంతో ఆ రెవెన్యూ కలపి 48 కోట్ల గ్రాస్ అధికారికంగా ఇప్పటికే దాటేసింది. ఈ సినిమా రేపు సోమవారం (వర్కింగ్ డే) వచ్చే వసూళ్లు అసలైన ఊపు చెప్పేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *