సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు ఎన్నికల సందడిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న నిర్వహంచేందుకు షెడ్యూల్ ప్రకటించారు. కానీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడటంతో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని ఈ నెల 5న మార్చాల్సి వచ్చింది. ఈ నెల 7న ఓట్ల కౌంటింగ్ ఉంది. తాజా సమాచారం ప్రకారం ఏపీ వ్యాప్తంగా 28 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లతో తుది జాబితాను ప్రకటించారు. టీడీపీ నుంచి 19,760మంది, వైఎస్సార్సీపీ నుంచి 17,726 మంది, జనసేన నుంచి 4,330మంది, బీజేపీ నుంచి 1049 మంది, ఇండిపెండెంట్లు 2012 మంది ఉన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 659 స్థానాలకు 4770 నామినేషన్లతో తుది జాబితా వచ్చేసింది. టీడీపీ నుంచి 1693, వైఎస్సార్సీపీనుంచి 1445 మంది, జనసేన పార్టీ 587, బీజేపీ 227 మంది, ఇండిపెండెంట్లు 227 మంది ఉన్నారు.
