సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న అర్నబ్ తుపాను శాస్త్రవేత్తలు చెప్పిన సమయం కంటే ముందే వచ్చి గోదావరి జిల్లాలను తుడిచి పెటేస్తే ఇప్పుడు వస్తున్నా మురుసు తుపాను కాస్త నెమ్మదిగా దూసుకొని వస్తుంది. ప్రస్తుతం నెల్లూరుకు 160 కిలీ మీటర్ల దూరంలో ఉన్న తీవ్ర తుఫాన్ ఒంగోలు వద్ద తీరం దాటే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే నరసాపురం భీమవరం ప్రాంత వాసులు, ఆక్వా, వరి వ్యవసాయ రైతులు కాస్త ఊపిరి తీసుకోవచ్చు.. ఒకవేళ భీమవరం వైపు తుపాను దిశా మార్చుకొంటే మాత్రం.. వరుస 2 తుపాన్ల దెబ్బకు ఇక మిగిలేది అస్సామ్ ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మురసు బలపడుతోంది. గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 22 కిమీ వేగంతో క‌దులుతున్న తీవ్ర తుపాన్ నేటి సోమవారం అర్ధ రాత్రి – తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని ఏపీ వివపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జౌన్ స్పష్టం చేశారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉందని.. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్ల వద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *