సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మురసు తీవ్ర తుఫాన్ ఒంగోలుకు దక్షిణంగా నేటి మంగళవారం తెల్లవారు జామున తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే అర్నబ్ తుపాను అంతా విధ్వసం లేదు. దీని ప్రభావంతో గోదావరి జిల్లాలతో పాటు కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీరం దాటిన ప్రాంతాల్లో గంటకు కనిష్ఠంగా 100 కిలోమీటర్లు, వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం మురసు తీవ్ర తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు సుమారు 8 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
