సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాయలసీమాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం తో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులను ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ తుపాను ప్రభావం తుపాను తీరం దాటిన ఒంగోలు తో పాటు బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలపై అధిక ప్రభావం చూపింది. భీమవరం లో నిన్న సాయంత్రం నుండి నేటి మంగళవారం ఉదయం 11 గంటల వరకు భారీ వర్షం పడింది. ఇంకా చిరు జల్లులు పడుతున్నాయి. . ఇక్కడకు సమీపంలోని మొగల్తూరులో ఏకంగా 79.34 మి.మీ వర్ష పాతం నమోదు అయ్యింది. ఇక ప్రక్కనే కోనసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. మల్కి పురంలో ఏకంగా 74.75 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. ప్రస్తుతం ముసురు వాతావరం నెలకొంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు ప్రకాశం జిల్లా కొత్తపట్నం ప్రాంతంలో అత్యధికంగా 164.25 మి.మీ. వర్షపాతం నమోదైంది.
