సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం.. శివోహం.. దీపావళి పండుగ ముగియగానే తదుపరి రోజు ఈనెల 9 వ తేదీ నుండి పరమశివునికి ఇష్టమైన మాసంగా పేరొందిన ‘పవిత్ర కార్తీకమాసం’ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్కంద పురాణంలో పేర్కొన్న 5 పంచారామాలు ను భక్తులు విశేషంగా దర్శించుకొంటారు. వీటిలో అతి విశిష్టమైనది భీమవరం గునుపూడిలో సాక్షాతూ చంద్రుడు ప్రతిష్టించాడని పురాణాలూ పేర్కొన్న శ్రీ సోమేశ్వరుని పంచారామ ఆలయం. ఇక్కడ ప్రపంచం లో ఎక్కడ లేని విధంగా చంద్రునివలె అమావాస్యకు గోధుమవర్ణం ,పౌర్ణమికి స్వచ్ఛమైన తెలుపులో శివలింగం రంగులు మారుతూ ఉంటుంది. ఇదో శివలీల అద్భుతంగా చెప్పుకొంటారు. అందుకే ఈ మాసంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఎంతో దూరప్రాంతాల నుండి తరలి వచ్చే వేలాది భక్తులకు దేవాదాయ శాఖ మరియు ధర్మ కర్తల మండలి సభ్యులు, దాతలు, స్వచ్చంధ సంస్థలు భక్తులు సహకారంతో ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దేవాలయం ఆవరణలో విశాలంగా భారీ పందిళ్లు నిర్మాణం ప్రారంభమయింది. గతంలో కార్తీక మాసం ఏర్పాట్లకు ఏ మాత్రం తగ్గకుండా భక్తులకు దర్సన సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నసమారాధన ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు దేవాలయ ఇఓ సిగ్మా న్యూస్ తో అన్నారు. దీనికి దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ బంగార్రాజు సహకారం ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *