సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా లో మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో యుద్ధాల జోలికి పోకుండా ట్రంప్ కాస్త ప్రశాంతంగా ఉండటంతో ప్రపంచం కూడా కాస్త ప్రశాంతంగా ఉంది. ముడిచమురు ధరలు దిగి వస్తున్నాయి. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్ నేడు, మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (SENSEX) 1,225 పాయింట్లు పెరిగి 76,918 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 (NIFTY) 370 పాయింట్లు లాభపడి 23,811 వద్ద ముగిశాయి. ఈ ర్యాలీతో నిఫ్టీ కీలకమైన 23,800 స్థాయిని మరోసారి తిరిగి చేరుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *