సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం 2 మునిసిపాలిటీలలో మాత్రమే ఎన్నికలు జరుగగా.. నేటి సాయంత్రానికి అక్కడ కౌంటింగ్ పూర్తీ కావస్తుంది. నరసాపురం మున్సిపాలిటీలో జనసేన ‘చైర్ పర్సన్’ మహిళా అభ్యర్థి ‘కొత్తపల్లి శైలజ’ విజయం సాధించగా మొత్తం 36 వార్డులలో 31 వార్డులు కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. అయితే 4 వార్డులులో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించగలిగారు. ఇక ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ చైర్ పర్సన్, మహిళా అభ్యర్థి ‘ఎండి నిలోఫర్‘ విజయం సాధించగా వార్డు సభ్యులులో మొత్తం 28 వార్డులకు ఏకగ్రీవాలు కలపి మొత్తం 23 వార్డులు కూటమి అభ్యర్థులు గెలుచుకోగా 5 వార్డులలో వైసీపీ అభ్యర్థులు గెలుచుకొని పార్టీ ఉనికి చాటుకొన్నారు.
