సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా మధ్యంతర ఎన్నికలలో ఘోర పరాజయంతో ట్రంప్, ఇరాన్ ఫై ఆవేశంతో ఊగిపోతూ తాజాగా.. తమ ఆదేశాలు పాటించి యుద్ధ విరమణ చెయ్యకపోతే ఇరాన్ ను తుడిచిపెట్టేస్తాను అంటూ మరోసారి బెదిరింపులకు దిగారు. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి శుక్రవారం ఉదయం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 227 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయాయి. అయితే ఆ తర్వాత కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల్లోకి మారాయి. మధ్యాహ్నం 2:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,265.64 పాయింట్లు పెరిగి 80,575.65 వద్ద కదలాడుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 323 పాయింట్లు లాభపడి 24,860 వద్ద ట్రేడవుతోంది అయితే మిడ్, స్మాల్ క్యాప్స్ విభాగాలు మాత్రం ఉదయం నుంచి నష్టాల్లోనే సాగుతున్నాయి. అలాగే యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతుండడంతో నిఫ్టీ బ్యాంక్ సూచీ దాదాపు 1.6 శాతం పెరిగింది , మొత్తానికి ‘దీపావళి శుభాకాంక్షలు తో లాభాలు పంచుతూ’ ఈవారం మార్కెట్ ట్రేండింగ్ ముగించింది.
