సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ విద్య సంస్థగా పేరొందిన భీమవరంలోని విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ మరియు ప్రముఖ ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థ కేపీఐటీ టెక్నాలజీస్ (KPIT Technologies) మధ్య కేపీఐటీ అపెక్స్ ల్యాబ్ (KPIT APEX Lab) ఏర్పాటుకు సంబంధించి నేడు, శుక్రవారం విష్ణు క్యాంపస్లో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థినులకు ఆధునిక ఆటోమోటివ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాలను పెంపొందించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.ఈ ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేయనున్న కేపీఐటీ అపెక్స్ ల్యాబ్ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినులకు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ తదితర ఆధునిక సాంకేతిక అంశాలపై ప్రత్యక్ష శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో కేపీఐటీ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ కేశవ్ కరుణాకర్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె.వి.ఎన్. సునీత మరియు విష్ణు సంస్థల డెరైక్టర్ శ్రీనివాస రాజు తదితరాలు పాల్గొన్నారు.
