సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పండుగ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అంబరంలో రంగురంగుల బాణసంచా కాల్పుల పండుగకు ఆబాల గోపాలం ఆతృతగా ఎదురు చూస్తారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్ధిక రాజధానిగా బాసిల్లు తున్న భీమవరంలో అయితే జిల్లాలోనే ఎక్కడ జరగనంత బాణాసంచా కాల్పులు ఇక్కడ జరుగుతాయి.. అయితే ఇటీవల వరుసగా 2 తుపాను కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు ఇంకా కోలుకోలేదు. దానికి తోడు ఈసారి కూడా బాణాసంచా సామాను కంటే వాటి ధరలే బాగా పేలుతున్నాయి. దానితో సామాన్యులు కొంత దూరంగా ఉంటున్నారు. ఏదిఏమైనా మరోసారి దీపావళి బాణాసంచా అమ్మకాలకు స్వగతం పలుకుతూ భీమవరం బై పాస్ రోడ్డులోని గ్రంధి శ్రీనివాస్ నూతన నివాసం దాటి పొలాలలో ఏర్పాటు చేసిన బాణాసంచా షాపుల కోలాహలం నేడు, శనివారం కాస్త పెరిగింది. (గతంలో లూధరన్ హై స్కూల్ లో షాపులు ఏర్పాటు చేసేవారు.. అయితే ఈసారి స్తానం మార్చారు) ఆ ప్రాంతంలో హోల్ సేల్, రిటైల్ కలపి సుమారు 40 బాణాసంచా షాపులు వెలిసాయి. బాణాసంచా వ్యాపారాలు అదృష్టం ఏమిటంటే గత 3 రోజులుగా పెద్దగా వర్షం పడకపోవడం ఈరోజు కూడా పచ్చందంగా ఎండ కాయడంతో వారు ఊపిరి పిలుచుకొంటున్నారు. ప్రజలు కూడా చక్కగా రేపటి దీపావళి పండుగ ఎటువంటి ప్రమాదాలు లేకుండా జరుపుకొంటారుగా.. మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *