సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి జిల్లాలోని ఇల్లెత్తూరు ఎంపీటీసీ కౌంటింగ్ హాలు వద్ద తొలుత 10 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి దేవి విజయం సాధించారు. అని ప్రకటించి తదుపరి ఆమెకు గెల్చినట్లు అధికారులు డిక్లరేషన్ పారం ఇవ్వకుండా కొంతసేపటికి రీకౌంటింగ్ జరిగిందని అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయప్రద 3 ఓట్లతో గెలిచిందని ప్రకటించడంతో అక్కడ వైసీపీ పరిశీలకురాలు మాజీ మంత్రి రోజా అదికారులు ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ గెలిచిన ఫలితం ఎలా మార్చివేస్తారని, పచ్చి మోసం ఎందుకు చేసారని వారిని ప్రశ్నించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె నిరసన తెలిపారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపి లెక్కించారంటూ దేవి ఆరోపించారు. మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే రోజా పోలీసులను , సీఎం చంద్రబాబు ను ఉద్దేశించి ఎన్నికలంటే ఇంత భయం ఉన్నవారు .. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రోజాను నేపథ్యంలో జీపు ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులు తరలించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *