సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, సోమవారం అమావాస్య సందర్భంగా పవిత్ర చండి యాగం ను ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు..72 మంది దంపతులు మరియు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ అరసవల్లి సుబ్రహ్మణ్యం మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ,యండ సత్యవతి పాపోలు ఏడుకొండలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఆదివారం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి స్థానిక భక్తులు చవ్వాకుల మోహన్ నాగశ్రీధర్, ధనలక్ష్మి శేషకుమారి దంపతులు 4 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు.
