సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గంలో తుపాన్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడ్డ పాడి రైతులకు, పశు పోషకులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం 47 టన్నులు (1870 బస్తాలు .. 25 కేజీల చొప్పున) దాణాను అందిస్తోందని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు) అన్నారు. భీమవరం పశువుల ఆసుపత్రిలో రైతులకు ఎమ్మెల్యే అంజిబాబు ఉచితంగా దాణా బస్తాలను అందించారు. భీమవరం మండలంలోని 5 పాయింట్లు దురుసుమర్రు, గొల్లవాని తిప్ప, గుట్లపాటు, వెంప, తుందుర్రు గ్రామంలో ఉచితంగా అందించడం జరుగుతుందని, తుపాన్ ప్రభావంతో భీమవరం, వీరవాసరంలో 12 పశువులు మృతి చెందాయన్నారు. మృతి చెందిన వాటికి రూ 50 వేలు, లేగ దూడకు రూ 25 వేలు, పాకల షెడ్డుకు రూ 5 వేలు చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం రైతులకు దాణా బస్తాలను అందించారు. బాలేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అంజిబాబు పర్యటించి పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులు, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వ భరోసా కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *