సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచా రామం గా భాసిల్లుతున్న గునుపూడి లోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానము నందు పవిత్ర కార్తీక మాసం లో నేడు రెండవ రోజు బుదవారం శ్రీ స్వామివారి ఆలయమునకు వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ప్రత్యేక దర్సనం టికెట్స్ ద్వారా రూ. 19,500/-రూపాయలు,లడ్డు ప్రసాదం విక్రయం వలన 1490/-రూపాయలు వెరసి 20,990/-రూపాయలు ఆదాయం లభించింది. మరియు శ్రీ స్వామివారి నిత్యాన్నదానం నందు కానుకల వలన రూ 75,500/-రూపాయలు ఆదాయం లభించిందని కార్యనిర్వహణాధికారి. ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫై తాజా చిత్రంలో నేటి సాయంత్రం శ్రీ దివ్య అలంకారం చూడవచ్చు..
