సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విలక్షణ జాతీయ నటుడు, ప్రకాష్ రాజ్ ఇటీవల కాక్రోచ్ పార్టీ కి మద్దతుగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరియు ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఏపీలోని జనసేన పార్టీ అధినేత పవన్ ఫై తనదైన శైలీ లో ప్రశ్నిస్తూ ఇటీవల జాతీయ రాజకీయాలలో కూడా బాగా పేమస్ అయ్యారు. దీనితో తనపై వస్తున్నా బాయ్‌కాట్ ట్రెండ్స్, పొలిటికల్ విమర్శలపై తీవ్రంగా స్పందించారు. గతంలో ‘కేజీఎఫ్’, ‘దృశ్యం 3’ సినిమాలను కూడా బ్యాన్ చేయాలని ట్రోల్ చేశారని, కానీ వాటిని ఆపలేకపోయారని అన్నారు. ఇప్పుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీలో తాను నటిస్తున్నందుకు ఎస్. ఎస్. రాజమౌళిని తిడుతున్నారని ఆ కోపం తో మన దేశంలో ‘వారణాసి’ చిత్రాన్ని బ్యాన్ చేస్తారా? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు..గతంలో తెలుగు . ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్’ మా ఎలక్షన్స్ లో తాను ఓడిపోలేదని, ఓడించారని ఆయన అన్నారు. లోపల ఏం జరిగిందో తెలియదని, చిరంజీవి వంటి సినీ పెద్దలు సపోర్ట్ చేసినా తనను ఓడించారన్నారు. ఇప్పుడు అసలు ‘మా’ ఎన్నికలే జరగడం లేదని, తెలుగు సినీ పరిశ్రమ తనను గతంలో ఎనిమిది సార్లు బ్యాన్ చేసిందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *