సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం సాయంత్రం భీమవరం కూటమి సీనియర్ నేతలు సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థులుగా ప్రతిష్టాకర భీమవరం మున్సిపల్ చైర్ పర్సన్ గా కౌన్సెలర్స్ గా పోటీ బరిలో దిగటానికి ఆశావాహుల పోటీ ఎక్కువ ఉన్న దృష్ట్యా కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల క్యాడర్ మధ్య సమన్వయము నెలకొల్పుకొంటూ ముందుకు వెళ్లాలని తీర్మానించారు. ఎట్టిపరిస్థితులలో ఎన్నికల బరిలో భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో తాము సంయుక్తంగా బలబరిచిన కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేద్దామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టిడిపి ఇన్ ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు అన్నారు ఈకార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ రామరాజు టీడీపీ సీనియర్ నేత మెంటే పార్ధ సారధి, కోళ్ల నాగేశ్వర రావు కూడా పాల్గొన్నారు. అనంతరం ఇప్పటి వరకు అర్జీలు పెట్టుకొన్న అభ్యర్థుల ఎంపిక పై మరియు కూటమి పార్టీల కి వార్డుల కేటాయింపులపై నేటి రాత్రి కీలక కసరత్తులు జరుగుతున్నాయి.
