సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ప్రపంచవ్యాప్తంగాఅత్యంత ప్రాచుర్యంలో ఉన్న మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగిస్తున్న లక్షలాది మంది యూజర్లు నేడు, శుక్రవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ ఈ-మెయిల్ సేవ ఔట్‌లుక్‌తో పాటు మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్ వంటి సేవల్లో సాంకేతిక సేవలు నిలిచిపోయాయి. గత గురువారం ప్రారంభమైన ఈ సమస్య నేడు శుక్రవారం కూడా కొనసాగుతోంది. దీంతో వ్యాపార సంస్థలు, ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించినప్పటికీ, అన్ని సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రస్తుతానికి ఇంకా స్పష్టత రాలేదు.
