సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల యువత కు కార్పొరేట్ ఉద్యోగ ఆశాకిరణం హైదరాబాద్ మహా నగరం. ఇక అమెరికా వెళ్లనక్కరలేదు.. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలుతో , ప్రజలు జీవనం కు ఐకాన్ గా హైదరాబాద్ హైటెక్ సిటీ, మాదాపూర్ మారిపోయింది. నగరం కిలో మీటర్లు మేర మహా సౌధాలతో విస్తరించింది. అయితే ఈ నిర్మాణాలకు, ఆధునిక జీవన విధానంలో విచ్చల విడిగా నీరు వాడటంతో, భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయి. ఆఖరికి భవిషత్తులో ఈ మహా నగరం మానవ నివాస యోగ్యమా? కదా? అన్న మీమాంస తలెత్తుతుంది. ఇటీవల కాలంలో నీటి కరువు తో ప్రజలు విలవిలా లాడుతున్నారు. విద్యారులు, పలు చోట్ల ఉద్యోగులు , విద్యార్థులు ఉండే పలు హాస్టల్స్ నీరు లేక అందరు ఖాళీ చేయవల్సిన పరిస్థితులు తలెత్తాయి. 20 లీటర్లు వాటర్ టిన్నులు ప్రతిరోజూ కొనుగోలుతో మరికొందరు అవసరాలకు సరిపెట్టుకొంటున్నారు. మంచి నీటి ట్యాంకర్లు కు భారీ డిమాండ్. మహా నగర దాహార్తి తీరుస్తున్న కీలకమైన సింగూరు, మంజీరా జలాలు త్వరలోనే నిలిచిపోనున్నాయి. తాజాగా.. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతమున్న జలాలు మరో 42 రోజులకు మాత్రమే సరిపోనున్నాయి. వర్షాలు కురవక, వరద రాక సింగూరు జలాశయం నీటిమట్టం పెరగలేదు. ఇక నవంబరు నెలలో వర్షాలు వస్తాయనే ఆశలు సైతం సన్నగిల్లాయి రెండు నెలలుగా అత్యవసర పంపింగ్ ద్వారా నగరానికి సింగూరు జలాలను తీసుకొస్తున్నారు. దీనితో డిసెంబర్ నెలాఖరుకు నగరానికి నీటి సరఫరా ఆగనుంది. అదే జరిగితే హైదరాబాద్ మహా నగరంలోని 14 లక్షల కుళాయిలు కనెక్షన్లలో 3లక్షల కనెక్షన్లకు నీటి కట కట తప్పదు. ఓటర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న శేరిలింగంపల్లిలోకి నీటి విషయంలో చాల కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరి జలాలను అందించేందుకు వాటర్‌బోర్డు ప్రయత్నిస్తోంది. అవి సఫలం కావాలని కోరుకొందాం.. .
