సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీకమాసాన్ని పురస్క రించుకుని ఒకే రోజు 5 పంచారామ పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం ఏపీఎస్ఆర్టీసీ గోదావరి జిల్లాలు, కృష్ణ గుంటూరు జిల్లాల వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పంచా రామ క్షేత్రాల దర్శనానికి ప్రతి ఆదివారం రాత్రి నుండి ప్రత్యేక బస్సును నడపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. ఈనెల 15, 22, 29 తేదీలతో పాటు డిసెంబరు 6వ తేదీ రాత్రి ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు చేసారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచా రామ క్షేత్రాలను దర్శించుకునేలా యాత్రను రూపొందించారు. దీనికి గాను పలు బస్సు స్టాండ్ ల నుండి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. భీమవరం నుండి వెళ్లే భక్తుల కోసం స్థానిక కొత్త బస్సు స్టాండ్ నుండి ప్రత్యేక బస్సుల సమాచారం కోసం ఫోన్ నెంబర్ 08816-239100 ను లేదా డిపో మేనేజర్ సెల్ నెంబర్ 99592 25485 సంప్రదించండి.
