సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం ఉదయం ఆకివీడు మండలంలో గత తుఫాను ప్రభావంతో ఇంకా నీటిలోనే ఉన్న వ్యవసాయ భూములను, వరి పంట పరిస్థితిని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పరిశీలించారు. ఇప్పటికే 2 వరుస తుఫానులు మన ప్రాంతం పైన ఎక్కువ ప్రభావం చూపిన కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు కు తక్షణమే నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని, రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా వారికీ ప్రభుత్వ భరోసా అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మరో తుపాను రాబోతుందని భావిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను రైతులను ఆదుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రఘురామా ఆదేశించారు.
