సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా కొత్త నిబంధనల ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో పయనించినప్పటికీ, మన భారతీయ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం నేడు మంగళవారం (నవంబర్ 17) అద్భుతమైన జోష్ కనబరిచాయి. ముడిచమురు ధరలు తగ్గడం, బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ముగిశాయి.ఎస్ఈ సెన్సెక్స్: 427.40 పాయింట్లు లాభపడి 82,532.19 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 82,897 వరకు సాధించింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ: 96.30 పాయింట్లు పెరిగి 25,387.40 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ ఒక దశలో 25,501 తాకింది. (ఫిబ్రవరి 26, 2026 తర్వాత నిఫ్టీ తొలిసారిగా ఇంట్రాడేలో 25,500 మార్కును తాకడం విశేషం).బ్యాంకింగ్ షేర్ల జోరు: నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ చరిత్రలోనే తొలిసారిగా 62,000 పాయింట్ల మైలురాయిని దాటి సరికొత్త ఆల్-టైమ్ హై (62,324.55 పాయింట్లు) నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (4% పైగా), కెనరా బ్యాంక్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మంచి లాభాలను ఆర్జించాయి.బలపడిన రూపాయి: క్రూడ్ ధరల పతనం కారణంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 93.92కి బలపడింది.
