సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిందని దీని ప్రభావంతో ఉత్తరాంద్రలో నేడు, గురువారం వర్షాలు కురుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం తుని నుండి నెల్లూరు వరకు ఉంటుంది అని భావించిప్పటికీ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 420కిలోమీటర్లు, ఒరిస్సాలోని పూరీకు 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది రేపు (శుక్రవారం) మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ ప్రాంతాల మధ్య గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు గురువారం, రేపు (శుక్రవారం) భీమవరం నర్సాపురం, కోనసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.
