సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాడు సింహాసనం సినిమాలో ‘ఆకాశంలో ఒక తార ; ఇప్పటికి ఎంతటి మ్యూజికల్ హిట్ అందరికి తెలిసిందే.. అదే సినిమా టైటిల్ గా.. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ నేడు,శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఏ సినిమాకు రానంత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోంది , హృదయానికి హత్తుకునే ఎమోషనల్ డ్రామాగా ప్రశంసలు అందుకుంటోంది. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ తర్వాత తెలుగులో దుల్కర్ ఖాతాలో మరో క్లాసిక్ సూపర్ హిట్ సినిమా చేరింది. ఈ సినిమా కధ గురించి సింపుల్ గా చెప్పాలంటే.. ‘ఆడపిల్ల’ అనే చిన్న చూపుతో కన్న తండ్రి ఏనాడూ చదువుకు సహకరించకపోయిన పట్టుదలతో చదివి అంతరిక్ష పయనం చేసిన ఒక పేదింటి అమ్మాయికి అండగా నిలచిన ఒక యువకుడి కధ ఇది.. ఇక సినిమా విశ్లేషిస్తే.. దుల్కర్ సల్మాన్ సినిమాలలో కధ లో ప్రేక్షకులు లీనం అవుతారు. అదే తీరున థియేటర్స్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకులను ఆకాశంలో ఒక తార వెంటాడుతుంది. మనం మన బాగు కన్నా మన ప్రక్కవారి ఆశయాలు గెలిపిస్తే వచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది అన్న సందేశం. యువతకు ఇస్తూ.. రూపొందిన ఈసినిమా లో కృష్ణ పాత్రలో దుల్కర్ సహజమైన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కొత్తమ్మాయి సాత్విక వీరవల్లితో ఆయన కెమిస్ట్రీ అద్భుతం, స్రుతి హాసన్ పాత్ర కు మంచి ప్రాధాన్యత ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, గున్నం గంగరాజు సంభాషణలు మంచి సింగీతం, మంచి ఫోటో గ్రఫీ, అశ్వనీదత్, అల్లు అరవింద్ కుటుంబ సభ్యుల నిర్మాణ సారథ్యంలోకొత్త దర్శకుడు పవన్ సాధినేని సూపర్ టాలెంట్ తో తెలుగు వారు గర్వపడేలా మంచి సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చుస్తే మంచిది. హృదయానికి హత్తుకునే ఎమోషనల్ డ్రామా ఈసినిమాలో ఉంది.
