సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలలో నేటి గురువారం నామినేషన్స్ విరమణ సమయానికి భీమవరం 9వ వార్డు ( స్థానిక 3 టౌన్ లోని హోసింగ్ బోర్డు ఏరియా ) లో వైసీపీ అభ్యర్థి తన నామినేషన్ ఉప సంహరించుకోవడం?తో అక్కడ నుండి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మేనల్లుడు వినోద్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మార్గం సులభం అయ్యింది. అయితే అధికారికంగా ప్రకటించవలసింది. అలాగే కూటమి లోని బీజేపీ భీమవరంలో అన్ని వార్డులలో నిలబడుతుంది అనుకొన్న బీజేపీ కూడా ముందు చేసుకోనున్న ఒప్పందం ప్రకారం 5 వార్డుల్లో మాత్రమే పోటీకి అంగీకారం తెలిపినట్లు తాజా సమాచారం.. అయితే ఇది కూడా అధికారికముగా ప్రకటించవల్సి ఉంది.
