సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో తెలుగు సినీ, టివి నటీనటులు ఎక్కువగా రోడ్డు ప్రమాదలకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఢీ షో కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ తరువాత శేఖర్ మాస్టర్ కి కూడా చిన్న ప్రామాదం జరిగింది. తాజగా గత అర్ధరాత్రి కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని కారులో భీమవరం తిరిగి వస్తుండగా జబర్దస్త్ ఆర్టిస్టులకు కారు ప్రమాదం జరిగింది… ఈటివి లో కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులైన కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు ప్రయాణిస్తున్న వేగంగా వెళ్లి టెలిఫోన్ స్తంభము ను ఢీ కొని తుక్కుతుక్కు అయ్యింది. భీమవరం సమీపంలోని గోరగనమూడి వద్ద నేటి ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్వల్ప గాయాలు తో ప్రెవేటు హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వారిని స్థానిక జనసేన ఎమ్మెల్యే అంజిబాబు హాస్పటల్ లో పరామర్శించారు.
