సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హిందూపురం ఎమ్మెల్యే, సీనియర్ సినీహీరో, నందమూరి బాలకృష్ణ, పీఏ పావులూరి శ్రీనివాసరావుపై తాజగా కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 65 మందిని పల్నాడు పోలీసులు అరెస్టు చేశారు. 66 మందిపై నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి. ప్యాక్షన్ సినిమా సన్నివేశాలు తరహాలో గుంటూరు నుంచి సుమారు 25 కార్లలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మారణాయుధాలతో దాడులకు సిద్థమైనట్లు పోలీసులు చెబుతున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాలలో పావులూరి శ్రీనివాసరావు వ్యవహారం ఆందోళన కలిగిస్తుంది. నందమూరి బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావుది పల్నాడుజిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం తిమ్మాపురం. శ్రీనివాసరావు వర్గీయులు సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు పోటీచేస్తున్నా నేపథ్యంలో.. వీరంతా నామినేషన్లు దాఖలు చేయటానికి యడ్లపాడులోని నామినేషన్‌ కేంద్రానికి కార్లతో ర్యాలీగా వెళ్లారు. తిమ్మాపురం కొంతకాలంగా వర్గపోరు ఉండటంతో సర్పంచి నామినేషన్ల సమయంలో అలజడి సృష్టించేందుకు పావులూరి శ్రీనివాసరావు వర్గం ప్రయత్నించిందని ఏఎస్పీ తెలిపారు. గుంటూరు నుంచి అనుమతులు లేకుండా 22 కార్లలో 100 మందిని తిమ్మాపురానికి తీసుకొచ్చినట్లు వివరించారు. వీరికి ఒకచోట మద్యం, బిర్యానీ సమకూర్చి.. కార్లలో కత్తులు, కర్రలతో వస్తుండగా పోలీసులు పావులూరి శ్రీనివాసరావుతో పాటు వారిలో 65 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరారైన వారి కోసం గాలింపు చేపట్టామన్నారు. మొత్తం 22 కార్లు, 4 పెద్ద కత్తులు, 60 కర్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *