సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీకమాసంలో పరమ శివుని అనుగ్రహం అనుగ్రహం ఎంతో పుణ్య ఫలమని, ఈ కార్తీకమాసంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం బీవీ రాజు పార్క్ సెంటర్ లోని శ్రీభోగలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం సోమవారం సందర్భంగా స్వామి వారిని ఎమ్మెల్యే అంజిబాబు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. వందలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తదుపరి భీమవరం మండలం రామాయణ పురం గ్రామంలో నేడు సోమవారం శ్రీఅయ్యప్ప స్వామి పడిపూజ భజన నిర్వహించారు. ప్రత్యేక మండపంలో అయ్యప్ప స్వామికి అలంకరణ చేసి పడిపూజ భజన నిర్వహించారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు కూడా హాజరు అయ్యారు. శ్రీ అయ్యప్పస్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 1000 మంది అయ్యప్పస్వామి, భవాని మాలధారణ భక్తులు భజనలో పాల్గొన్నారు
