సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ స్థాయిలో బంగారం వెండి ధరలు దిగి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో నేటి బుధవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ , విజయవాడ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,580కు పడిపోయింది. నిన్నటితో పోలిస్తే ధరలో రూ.3,220 మేర కోత పడింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,950 మేర దిగి వచ్చింది. . ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,14,200గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేటి బుధవారం కిలో వెండి ధర రూ.10 వేల మేర తగ్గి రూ.1.65 లక్షలకు దిగి వచ్చింది. కొద్దీ నెలలు క్రితం 4 లక్షలు పైగా ఎగసిన వెండి మెరుపులు ఇప్పుడు ఇంత స్థాయికి దిగిరావడం గమనార్హం.
