సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి ప్రభుత్వం అనకాపల్లిలో 720 మెగావాట్ల డాటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనికోసం జిల్లాలోని తూలిపాళ్ల వద్ద 200 ఎకరాలను కేటాయిస్తూ తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం బాలేవాడి టెక్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 47,009 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.అలాగే.. విశాఖపట్నంలోని కాపులుప్పాడ వద్ద ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 2,187 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ సంస్థ కోసం ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా సుమారు 29,600 మందికి ఉపాధి అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
