సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు 8 ఏళ్ళ తరువాత భీమవరం మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు హోరా హోరా ఎన్నికల ప్రచారాన్ని నిలుపుదల చేసారు. అభ్యర్థుల ప్రచార సందడి మైక్ ల ప్రచారం ఎన్నికల నిబంధనల మేరకు ఆగిపోయాయి. ఇక రేపు గురువారం పోలింగ్ కు అధికారులు సర్వము సిద్ధం చేస్తున్నారు. కొత్తగా విలీన గ్రామాలతో కలపి మొత్తం 52 వార్డుల లలో సుమారు ఓకటిన్నర లక్షల పైగా పట్టణ ఓటర్లు ఓటు వెయ్యడానికి వార్డు కు వచ్చి 2 నుండి 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. మొత్తం పట్టణంలో 157 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఓటర్ 2 ఓట్లు వినియోగించుకోవాలి. ఒకటి పట్టణ చైర్ పర్సన్ అభ్యర్ధికి, మరో ఓటు స్థానిక కౌన్సిలర్ అభ్యర్ధికి వెయ్యాలి. .ఓటర్లు ముందుగానే తమ ఓటు ఎక్కడ వెయ్యాలో తెలుసుకొని తమ ఓటర్ స్లిప్ తో పాటు ఐడి కార్డు ,లేదా ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొనివెళ్ళాలి. తాజా సమాచారం ప్రకారం కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18ఏళ్ళు నిండిన యువతకు ఐడి కార్డు వచ్చినప్పటికీ ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం లేకపోవడం దురదృష్టకరం.. ఎన్నో వేల మంది యువత నిరాశ చెందారు. పాత ఓటర్లు లిస్ట్ ప్రకారం ఓటింగ్ జరుగుతుంది. మీ ఓటు హక్కు ప్రస్తుతం ఏ లిస్ట్ లో ఉందొ? అసలు లేదో? తెలుసుకోవడానికి https://sec-ems.ap.gov.in/apsec/knowYourPS వెబ్ సైట్ లో ఇప్పుడే కిక్ చేసుకొని మీ ఓటు తనిఖీ చేసుకోండి.
