సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భముగా నేడు, శుక్రవారం ఆయన నటిస్తున్న .. మొగలాయి చక్రవర్తుల కాలంనాటి చారిత్రక కధాంశం తో పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌సినిమా ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి తాజాగా పవర్ గ్లాన్స్ వీడియో ను విడుదల చేసారు. మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో .. తెలుగోడు అనే పాటతో పవన్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో పవన్ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుందిఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం,కననడం, మలయళం,హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
