సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సినిమా లో నటించి పెద్ద హీరోయిన్స్ అయిపోవచ్చు అనుకొనే యువతులకు గేలం వేసి మోసగిచ్చే ప్రబుద్దుల కధలు ఇప్పటికే కోకొల్లలు.. అయితే ఇలా సినీ అవకాశాల పేరుతో ఏకంగా 300 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఒక దర్శకుడు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. సేలంలో సినిమా కంపెనీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న దర్శకుడు వేల్ క్షత్రియన్. అవకాశాలు పేరుతో యువతులను అశ్లీల ఫొటోలను, వీడియోలను చిత్రీకరించి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతనికి సహకరించిన జయజ్యోతి అనే సహాయకురాలి బండారాన్ని అదే కార్యాలయంలో పని చేసే ఇరుప్పాళ్యంకు చెందిన జానకి (పేరు మార్పు) బయటపెట్టింది. వారి అరాచకాలు గురించి సూరమంగళం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ సుబ్బులక్ష్మి నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో దర్శకుడు వేల్ క్షత్రియన్ గుట్టురట్టు అయ్యింది. అతని కార్యాలయంలో తనిఖీలు చేసి 30కి పైగా హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌ట్యాప్, పెన్‌డ్రైవ్‌లు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్‌డిస్క్‌లో 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియో దృశ్యాలు ఉండటంతో పోలీసులే షాక్ తిన్నారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ఇంకా ఈ రాకెట్ లో లోతుగా విచారణ చేస్తున్నారు.
