సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో పలు విద్య సంస్థలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమవరం డీఎన్ ఆర్ కళాశాల విద్యాసంస్థలలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర బధిర విద్యార్థుల పాఠశాల లో గురుపూజ వేడుకలు నేడు, సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు అయిన డీఎన్ ఆర్ కళాశాల విద్యాసంస్థల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. ఈ రోజు ఈ బధిర విద్యార్థుల సమక్షంలో వేడుకలు జరగటం ఆనందంగా ఉందని శ్రీకాకుళం మొదలు ప్రకాశం జిల్లా వరకు ఉన్న బధిర విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల బోర్డు సహకారంతో డీఎన్ ఆర్ కళాశాల విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఇక్కడ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొనివెళ్లే కృషి జరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి మోజెస్ తదితర అధ్యాపక సిబ్బంది గురుపూజ గురించి విద్యార్థులకు తెలిపి తదుపరి బధిర విద్యార్థులకు రొట్టెలు, బిస్కెట్ పాకెట్స్ పంపిణి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *