సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 6నెలలుగా ముఖ్యముగా హర్ముజ్ జలసంధి టార్గెట్గా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్, ఒమన్ దేశాల మధ్య తాజగా ఒప్పందం కుదిరింది. ఇక హోర్ముజ్‌ను తమ అమెరికా భూభాగంగా వాషింగ్టన్ ప్రకటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత శుక్రవారం చేసిన బెదిరింపు వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు కలిగిన ఈ జలసంధి తమ ఆధీనంలోనే ఉంటుందని ఇరాన్ పేర్కొంది. ఒప్పందంలో భాగంగా ఒమన్‌తో ఇతర అంశాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. నౌకల సురక్షిత రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం ప్రత్యేకంగా జరిగాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ప్రకటించారు.
