సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత ,రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రదేశ్ లో స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి , ఆయన తనయుడు జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తరహా పాదయాత్రను ఆదర్శంగా తీసుకొన్నట్లు ఉన్నారు. దేశంలో మసకబారిపోయిన కాంగ్రెస్ పునరుజ్జీవానికి, బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకొనేందుకు, ప్రజలతో తిరిగి మమేకం కావడానికి కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నేడు, బుధవారం తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభంఅయ్యింది.( దీనికి ముందుగా.. నేటి ఉదయం శ్రీ పెరంబదూర్ లోని తండ్రి రాజీవ్ గాంధీ మరణించిన చోట నిర్మించిన స్మారక స్థలానికి చేరుకొని ఆయన కు నివాళ్లు అర్పించారు) రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుండి పాదయాత్ర ను మొదలుపెట్టి శ్రీనగర్ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర,ఐదు నెలల పాటు సాగుతుంది. కన్యాకుమారి లో నేటి సాయంత్రం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మిత్రపక్షం డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారు. నిత్యం సగటున 22-23 కి.మీ. పాదయాత్ర జరుగు తుంది. కన్యాకుమారి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూరు, బళ్లారి, రాయచూరు, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌసా, ఆల్వార్, బులంద్ శహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్ము.. చివరగా శ్రీనగర్ చేరుకుంటారు. ఈ యాత్రకు ‘కలిసి నడవండి.. దేశాన్ని ఐక్యం చేయండి’ అని ట్యాగ్‌లైన్ పెట్టారు.
