సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం ఉదయం దర్శించుకున్న పాలకొల్లు సమీపంలోని యలమంచిలి లంక గ్రామానికి చెందిన TS.శ్రీనివాస్ రావు పద్మ దంపతులు శ్రీ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి 55,021 రూపాయలు కానుకగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు శ్రీ అమ్మవారి ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం ఆలయ ధర్మకర్తలు కారెంపూడి ఆదిలక్ష్మి,పాపొలు ఏడుకొండలు ప్రసాదం ఫోటో అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
