సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు లో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ‘నీట్ ‘పరీక్షా ఫలితాలు విడుదలయిన కేవలం 2రోజులో రాష్ట్రంలో నీట్లో ఉత్తీర్ణత సాధించని కారణంగా ఒక ఫోబియా తరహాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేకిత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20 మందిని నీట్ బలికొంది.దీనితో కేంద్రం నీట్ ను రద్దు చెయ్యాలని రాష్ట్రంలో విద్యార్థులు ఆందోళన పదం పట్టారు. తాజాగా.. స్థానిక ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్ చోళాంబేడు ఇందిరా నగర్‌కు చెందిన అముద ఈరాపురం సమీపంలోని బండేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఏకైక కుమార్తె లక్ష్మణశ్వేత ఫిలిఫ్పైన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతూ జూలై 17న నీట్ రాసింది. నీట్ ఫలితాలలను ఆన్లైన్ లో చూసిన లక్ష్మణశ్వేత ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో బోరున విలపించింది. తల్లి ఆమెను ఓదార్చినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇంట్లో అందరూ నిద్రలో ఉన్న సమయంలో గురువారం వేకువజామున లక్ష్మణశ్వేత ఇంటి హాలులో ఫ్యానుకు ఉరేసుకు ని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విద్యార్థి మరణం తో కలపి ఇప్పటికి 20 మృతి చెందగా మరో విద్యార్థిని మృత్యువు తో పోరాడుతుంది. ఎన్నో ఆశలతో ఇంత స్థాయికి వచ్చి ఆ విద్యార్థులు కేవలం ఒక్క పరాజయాన్ని తట్టుకొనే శక్తి లేక మరణించడం తల్లి తండ్రులకు క్షోభ మిగల్చడం ఫై మన విద్య విధానాలలో మార్పు తీసుకొనిరావాల్సిన అవసరం స్వష్టంగా ఉంది.
