సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత 3 రోజులుగా కుంభ వృష్టి కురుస్తున్న నేపథ్యంలో ఇటీవల ప్యాచ్ వర్క్ చేసిన ప్రధాన రోడ్లపై మరల గ్రావెల్ బయటకు గుంతలు పెద్దవి కావడంతో వర్షంలో వాహనాలపై ప్రయాణిస్తున్న వారు వాటిలో పడి గాయాలు పాలు అవుతున్న ఘటనలు విరివిగా జరుగుతున్నాయి. నేటి సాయంత్రం 5- 30గంటలకు స్థానిక విష్ణుపూర్ కు వెళ్లే రూటులో ఒక యువకుడు బైకుపై వస్తూ ఊహించని విధంగా గుంటలలో నడిపి పడి పొగ రాళ్ళూ గుచ్చుకొని అతని తలకు, కాలుకు తీవ్ర గాయాలు అయ్యి రోడ్డుపైనే తీవ్ర రక్త స్రావం జరగడంతో అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. తదుపరి రోడ్డుపై వెళ్లేవారు అతనిని ప్రక్కకు చేర్చి సపర్యలు చేసాక కళ్ళు తెరిచాడు. వెంటనే అతనిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అతను వివరాలు ఇంకా చెప్పే స్థితిలో లేదు. త్వరగా కోలుకోవాలని కోరుకొందాం.. ఆర్ & బి అధికారులు మరియు పట్టణ అధికారులు ఈ వర్షాలతో సుందరీకరణ పనులు కు కొద్దీ విరామం ఇచ్చి పట్టణంలో ప్రధాన రోడ్లపై ఇప్పటికే ఏర్పడిన గుంతలు పూడ్చాలి., శ్రీ మావుళ్ళమ్మ దేవాలయం పరిధిలో ( శ్రీ వెంకటేస్వర బుక్ డిపో వైపు ) దిగబడిన రోడ్డు మార్జిన్ పనులు త్వరితంగా పూర్తీ చెయ్యకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
