సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేషనల్ కరాటే ఓవరాల్ చాంపియన్ షిప్ తపన ఫౌండేషన్ కప్ పోటీలు, నేడు, శనివారం ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీ ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఆరు రాష్ట్రాల నుండి 600 మంది కరాటే క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. జాతీయస్థాయి కరాటే పోటీలను తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి (తపన) ఘనంగా ప్రారంభించారు. దేశంలోని ఆరు రాష్ట్రాల నుండి 46 టీమ్ లు, 600 మంది కరాటే విద్యార్థులు ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు. చతిస్గడ్, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తెలంగాణ రాష్ట్రాల నుండి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్రీడాకారులు తరలివచ్చి కరాటే పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ,గారపాటి చౌదరి మాట్లాడుతూ.. ఏలూరులో జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు దసరా నుండి ఏలూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే10 కేంద్రాల్లో విద్యార్థినిలకు, మహిళలకు ఉచితంగా కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించనున్నాం ఆని ప్రతి ఒక్క మహిళలు, విద్యార్థినిలు త్వరలో ప్రారంభించనున్న కరాటే శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని గారపాటి చౌదరి కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *