సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు అనే వార్త నేటి ఆదివారం తెల్లవారగానే అందరికి మీడియా ద్వారా తెలియడం తో తెలుగు సినీ పరిశ్రమ లో పూర్తీ విషాదం నిండుకొంది. ఆయన సినీ వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ లోనే కృష్ణంరాజు భౌతికకాయం వద్ద ఉన్నారు.ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి నివాళ్లు అర్పిస్తున్నారు. రేపు సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఆయన పార్ధీవ దేహానికి అంతిమ వీడ్కోలు కు ఏర్పాట్లు జరుగుతాయి. పలువురు సినీప్రముఖులు కృష్ణంరాజు మృతి పట్ల తీవ్ర సంతాపం, ఆయనతో తమ అనుబంధాన్ని వివరిస్తున్నారు. బాలకృష్ణ ,పవన్ కళ్యాణ్అనుష్క, వివి వినాయక్ లు తమ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. కృష్ణంరాజు తో పాటు పశ్చిమ గోదారి జిల్లాలో మొగల్తూరు కు చెందిన మరో సీనియర్ హీరో చిరంజీవి ట్విటర్లో .. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి మనవూరి పాండవులు దగ్గరనుంచి నేటి వరకూ నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్ కు నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయనలేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడిలాంటి ప్రభాస్ కు నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక మా అడ్జక్షుడు మంచు విష్ణు తన ట్విటర్ లో.. తెలుగు లెజెండ్ , మా తండ్రి మోహన్ బాబు కు సొంత సోదర సమానుడు మా పెద్దనాన్న కృష్ణంరాజు మృతి మా కుటుంబానికి తీరని లోటు.. తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయింది అని ట్విట్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *