సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి నూతన ట్రాఫిక్ సీఐగా విధుల్లో చేరిన జి దాస్ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పట్టణంలో ట్రాఫిక్ విషయంలో తగు చర్యలు ఎప్పటికప్పుడు తీసుకొని ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా నలుమూలల నుండి వివిధ పనుల తో వచ్చే వేలాది వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను అదుపు చేసే దిశగా అందరిని సమన్వయం చేస్తూ , సమర్ధత తో పనిచేయాలని అన్నారు.
