సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ముస్లిం జె.ఏ.సి., కన్వీనర్, ఎండీ సిద్ధిక్ నేడు, ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలియజేసారు… భీమవరం.ది.01.01.2020 న స్థాపించబడి, అన్ని ముస్లిం ధార్మిక సంస్థల, కమిటీల ప్రతినిధులతో కలిపి ఒక ముస్లిం ఐక్య వేదికగా “ముస్లిం జె.ఏ.సి., భీమవరం” పేరుతో ఒక సంస్థ స్థాపించి ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తున్నాము ఇది , హిందూ ముస్లింల మధ్య సఖ్యత కోసం, అవసరార్ధుల సహాయం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ. ఆ పేరుతో ఇప్పటి వరకు ఏ మరో సంస్థ లేదు. ఇది ది. భీమవరం ముస్లిమ్స్ కమిటీ సహకారంతో నడుచుచున్న సంస్థ. అయితే కొందరు మా పేరును వాడుకుంటున్నారని మాకు సమాచారం అందింది. కాబట్టి మా పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు అడిగితే మమ్మల్ని సంప్రదించకుండా ఎవరూ ఎవరికి డబ్బులు (చందా) ఇవ్వకండి. అలా ఇచ్చినట్లయితే మాకు ఎటువంటి బాధ్యత లేదు. మాకు లేదా మా అధికారిక ప్రతినిధులకు మాత్రమే మీ విరాళం ఏదైనా ఇచ్చి వెంటనే రసీదు పొందగలరు. ఎవరైనా మా పేరు వాడుకొని ఏదైనా చట్టవ్యతిరేక, అసాంఘిక, విద్వేషాపూరిత కార్యక్రమాలు చేస్తే ..దానికి మీరు సాక్షులు నిలబడితే మేము వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాము. దుష్టుల కుట్రల నుండి మేము దేవుని శరణు కోరుతున్నాము. మీరు పిర్యాదు చేసే నెంబర్: 9848677137

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *