సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లోని స్టానిక డి.యన్.ఆర్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు నివాళ్లు అర్పిస్తూ ఇంజనీరింగ్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ దాసి రాజు ఇంజనీరింగ్ డే ను పురస్కారించుకుని మాట్లాడుతూ .. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నీటి పరిరక్షణపై మక్కువతో నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు వేశారు అని అన్నారు. జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ దాసి రాజు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇంజనీర్ లేనిదే..ఆనకట్టలు నిర్మించడం ద్వారా బీడుబారిన భుమ్ములను సస్యశ్యామలంగా చేసి తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన ఘనత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకే దక్కుతుంది అని అన్నారు. స్వహత గా ఇంజనీర్ ఐన కళాశాల కార్యదర్శి గాధిరాజు సత్యనారయణ రాజు (బాబు) మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలను తెలియ జేశారు సమయపాలన, నిబద్ధత, అంకితభావానికి మారు పేరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేటి యువతకు ఓ ప్రేరణ.అని అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.అంజన్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమం లో చెరుకువాడ రంగ సాయి, లయన్స్ క్లబ్ అద్యక్షులు నందమూరి రాజేష్, లయన్స్ క్లబ్ కార్యదర్శి శ్రీ నరహరశెట్టి కృష్ణ, అధ్యాపక సిబ్బంది విద్యార్ధులు పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *