సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో సుమారు 70 ఏళ్ళ క్రితమే కనుమరుగు అయిన “చీతాలు” మరల ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భముగా నేడు, శనివారం దేశంలోకి ప్రవేశించాయి. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చీతాలను పార్కులోకి నేటి ఉదయం పార్క్ లోనికి విడిచిపెట్టడం జరిగింది. ప్రధాని మోడీ స్వయంగా వాటిని ఫోటోలు తియ్యడం మరో విశేషం.. దీనికోసం ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చీతాలతో బయలుదేరిన ప్రత్యేక కార్గో విమానం పదిగంటలు ప్రయాణించి నేటి శనివారం ఉదయానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకొని అక్కడనుంచి వాటిని కునో నేషనల్ పార్కు వద్దకు చీతా లను తీసుకొనిరాగా వాటిని పార్క్ నిర్వాహకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చీతాలను పార్కులోకి వదిలారు. ఈ కార్యక్రమం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అటు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించారు. ఈసారి చీతాల సమక్షంలో ప్రధాని రోజంతా గడపాలని నిర్ణయించుకున్నారు. దీంతో అధికారులు పార్కు పరిసరాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. కాగా, చీతాలను భారత్‌కు తీసుకురావాలనే ఆలోచన మొదటిగా చేసింది, నమీబియాతో 8ఏళ్ళ క్రితమే ఒప్పదం చేసుకొంది తామేనని చితా తో మంత్రి జైరాం రమేష్ ఫోటో పెట్టి కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో ఫోటో పెట్టి ప్రకటించడం కొసమెరుపు..( update photo)
