సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొద్దీ రోజులు విరామం ఇచ్చి వరుసగా కుమ్మేస్తున్నాయి. బంగాళాఖాతంలో మరల ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో రేపు బుధవారం , ఎల్లుండి గురువారం 2 రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర , ఒరిస్సా లో దీని ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని, తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ, నేడు, మంగళవారం వెల్లడించింది. ఒడిశా రాష్ట్రంలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆరంజ్ అలర్ట్ జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *