సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; సీఐటీయూ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి పలు కార్మిక సంఘాల నుండి వచ్చిన సుమారు 5వేల మంది కార్మికులుతో మహా ధర్నా జరిగింది. జిల్లా కలెక్టర్ , ప్రశాంతి కి తమ డిమాండ్స్ తో కూడిన విన్నతి పత్రం అందజేశారు. అక్కడ Jnv గోపాలన్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. ఉమామహేశ్వరరావు కార్మికులనుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీ, రాష్ట్రంలో జగన్ లు పోటీలు పడి ప్రజలపై రోజూ భారాలు మోపడంలో ఇద్దరికీ ఇద్దరేనని, రోజు రోజుకు అన్ని ధరలు పెరిగిపోతూనే ఉన్నాయని, కానీ కార్మికుల కనీస వేతనాలు మాత్రం 15 ఏళ్ళు అయినా పెంచకపోతే ఎలా బ్రతుకుతారనుకున్నారని? ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ప్రభుత్వ వత్తాసుతో యజమానులు పనిగంటలు పెంచివేయడం, ఇష్టానుసారం తొలగించడం, కార్మికులను వేధింపులకు గురి చేయడం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే 4లేబర్ కోడ్స్ మోడీ తీసుకువస్తే వాటి అమలుకు విధి విధానాలు రూపొందించడం కోసం మనం రాష్ట్రాన్ని జగన్ వేదికగా చేయడం శ్రామిక వర్గానికి తీరని ద్రోహమేనని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా కనీస వేతన జీవోలను సవరించి, కనీస వేతనం 26వేలుగా నిర్ణయించకపోతే భవిష్యత్ లో తీవ్రమైన పోరాటాలకు కార్మికవర్గం సిద్ధపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజారామ్మామోహన్ రాయ్, చింతకాయల బాబురావు ,శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి. కళ్యాణి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి. వాసుదేవరావు,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దాసిరెడ్డి కోటేశ్వరరావు, రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కె. సత్యనారాయణ, ఐకేపీ జిల్లా అధ్యక్షులు ఏ. నిర్మలా దేవి, ఆక్వా డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ భాషా, సివిల్ సప్లయ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్. ఉదయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. .
